బిగ్ బాస్ 2 ఫైన‌ల్‌కి గెస్ట్‌గా వ‌చ్చేది ఎవ‌రు..? ఏమో ఏదైనా జరగొచ్చు...

బిగ్ బాస్ 1 సీజ‌న్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఫ‌స్ట్ సీజ‌న్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అద‌ర‌గొట్టాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 2 స‌క్స‌స్‌ఫుల్‌గా కంప్లీట్ కానుంది. ఈ షోకి నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌

గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:12 IST)
బిగ్ బాస్ 1 సీజ‌న్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఫ‌స్ట్ సీజ‌న్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అద‌ర‌గొట్టాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 2 స‌క్స‌స్‌ఫుల్‌గా కంప్లీట్ కానుంది. ఈ షోకి నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 క్లైమాక్స్‌కు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో ముగిసిపోనుంది. దీంతో బిగ్ బాస్ 2 విన్న‌ర్‌గా ఎవ‌రు నిలుస్తారు అనేది ఆస‌క్తిగా మారింది.
 
ప్ర‌స్తుతం ఈ షోలో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో విన్నర్ ఎవరో తెలియక బిగ్ బాస్ ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఇక ఇదిలాఉంటే ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఎవ‌రు రానున్నార‌నేది ఇంట్ర‌స్టింగ్‌గా మారింది. అవును.. విష‌యం ఏంటంటే.. టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి దేవ‌దాస్ అనే సినిమా చేసారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం, అలాగే నాగార్జున‌కు మా టీవీతో ఉన్న అనుబంధంతో బిగ్ బాస్ 2 ఫైన‌ల్ ఎపిసోడ్‌కి నాగార్జున గెస్ట్‌గా రానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 1కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫైన‌ల్ ఎపిసోడ్‌కి గెస్ట్ వ‌చ్చేందుకు ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 2 ఫైన‌ల్ ఎపిసోడ్ గెస్ట్ నాగ్ లేక తార‌క్ లేక చిరంజీవి వీరిలో ఎవ‌రో ఒక‌రు రావ‌డం మాత్రం ఖాయం అంటున్నారు. వీళ్లు కాకుండా బిగ్ బాస్ ఇంకెవర్నయినా పిసుస్తారేమో.... ఏమో ఏదయినా జరగొచ్చు.

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments