గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 19 ఆగస్టు 2017 (13:38 IST)

షాకింగ్... బిగ్ బాస్ తెలుగు హౌసుకు నమిత...? దీక్షా పంత్ ఎలిమినేట్ అవుతుందా?

బిగ్ బాస్ తెలుగు వారాంతానికి వస్తుందనగానే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం కొత్తవారు రావడం జరుగుతోంది. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి ముళ్ల కిరీటం పెట్టుకుని హౌసు నుంచి బయటకు వచ్చేస్తున్నారనుకోండి. పోయినవారం సింగర్ కల్పన ఎలిమినేట్ అవడమే కాకుండా బయటకు వచ్చి ఎన్ట

బిగ్ బాస్ తెలుగు వారాంతానికి వస్తుందనగానే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం కొత్తవారు రావడం జరుగుతోంది. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి ముళ్ల కిరీటం పెట్టుకుని హౌసు నుంచి బయటకు వచ్చేస్తున్నారనుకోండి. పోయినవారం సింగర్ కల్పన ఎలిమినేట్ అవడమే కాకుండా బయటకు వచ్చి ఎన్టీఆర్ తో కలిసి బిగ్ బాస్ హౌసులో వున్నవారిని చూస్తూ తొడగొట్టి పాటలు పాడింది. అలా గత వారం జరిగింది. ఈ వారం ఒకరో ఇద్దరో ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది.
 
దీక్షా పంత్, అర్చన ఎక్కువ చేస్తున్నారంటూ వాదనలు వినబడుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది పక్కన పెడితే కొత్తగా వైల్డ్ కార్డుతో హాటెస్ట్ తార నమిత ఎంట్రీ అవుతుందని ఓ ప్రచారం నడుస్తోంది. నమిత తమిళ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి అడవుల్లో తిరుగుతోంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కోసం ఆమె అడవుల నుంచి తిరిగి వచ్చేస్తుందట. నిజంగా ఆమె ఎంట్రీ ఇచ్చుకుంటుందా... వెయిట్ అండ్ సీ.