శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (19:27 IST)

బిగ్ బాస్... ఆ వెంట్రుక నోటితో కొరుకు... అర్చనతో నవదీప్, ఇంకాస్త కిందకి కట్టి నొక్కు... శివతో దీక్ష

బిగ్ బాస్ తెలుగు షో కూడా మెల్లమెల్లగా అర్థనగ్న దృశ్యాలకు నెలవుగా మారుతోంది. బిగ్ బాస్ అంటేనే ద్వంద్వార్థాలు అనేది తెలిసిందే. ఐతే తెలుగు బిగ్ బాస్ ప్రారంభమైన దగ్గర్నుంచి శ్రుతి మించకుండా చక్కగా సాగుతోంది. కానీ బుధవారం రాత్రి ఎక్కడో తంతోందన్నయ్యా అన్నట

బిగ్ బాస్ తెలుగు షో కూడా మెల్లమెల్లగా అర్థనగ్న దృశ్యాలకు నెలవుగా మారుతోంది. బిగ్ బాస్ అంటేనే ద్వంద్వార్థాలు అనేది తెలిసిందే. ఐతే తెలుగు బిగ్ బాస్ ప్రారంభమైన దగ్గర్నుంచి శ్రుతి మించకుండా చక్కగా సాగుతోంది. కానీ బుధవారం రాత్రి ఎక్కడో తంతోందన్నయ్యా అన్నట్లనిపించింది. 

హీరోయిన్ దీక్షా పంత్ ఏకంగా శివ బాలాజీని తనకు మసాజ్ చేయాలని అడగడమే కాకుండా టవల్ కట్టుకుని వున్న శివబాలాజీతో నీ టవల్ ఇంకొంచెం కిందికి కట్టు అంటూ అడగడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దీక్షా పంత్ అలా అడగటం చాలా చాలా బాగోలేదంటున్నారు బుల్లితెర వీక్షకులు. 
 
అంతేనా మొన్ననే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ అయితే నటి అర్చనకు ఓ బీభత్సమైన టాస్క్ ఇచ్చాడు. అదేమిటంటే... తన కాలుపై వున్న వెంట్రుకలను కొరకాలట. ఇలా అభ్యంతరకరంగా సాగింది బుధవారం నాటి బిగ్ బాస్ షో. మరి ఇవాల్టి షో ఎలా సాగుతుందో ఏంటో?