శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (15:20 IST)

నవదీప్ పబ్‌లో స్పెషల్ డ్రింక్.. తాగితే 6-8 గంటలు మత్తులోనే...

టాలీవుడ్ యువ నటుడు నవదీప్‌కు హైదరాబాద్‌లో పబ్‌ ఉంది. ఈ పబ్‌లో సర్వ్ చేసే ప్రత్యేక డ్రింక్‌ను తాగేవారు 6 నుంచి 8 గంటల పాటు తమను తాము మైమరచిపోయి... అదో లోకంలో వివహిస్తారట. పైగా, ఈ పబ్‌కు వెళ్లేవారు ఈ డ్

టాలీవుడ్ యువ నటుడు నవదీప్‌కు హైదరాబాద్‌లో పబ్‌ ఉంది. ఈ పబ్‌లో సర్వ్ చేసే ప్రత్యేక డ్రింక్‌ను తాగేవారు 6 నుంచి 8 గంటల పాటు తమను తాము మైమరచిపోయి... అదో లోకంలో వివహిస్తారట. పైగా, ఈ పబ్‌కు వెళ్లేవారు ఈ డ్రింక్ కావాలంటే ఓ కోడ్ నంబర్ చెప్పాలట. అపుడే ఈ డ్రింక్‌ను సర్వ్ చేస్తారట. 
 
హైదరాబాద్‌లో వెలుగు చూసిన మత్తుమందు దందాలో అనేక ఆసక్తిక విషయాలు వెలుగు చూస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలోభాగంగా నవదీప్ సోమవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యాడు. ఆయన సోమవారం ఉదయం 10.20 గంటలకు సిట్‌ కార్యాలయానికి వచ్చారు. అలాగే  సిట్‌ అధికారులు పబ్‌ల నిర్వహణపై నవదీప్‌ను విచారణ చేస్తున్నారు. డ్రగ్స్‌ వాడకం, కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
 
ప్రధాన నిందితుడు కెల్విన్‌ కాల్‌ డేటాల్‌ నవదీప్‌ ఫోన్‌ నంబర్‌ ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. పబ్‌ల మాటున డ్రగ్స్‌ దందా చేసినట్లు నవదీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్‌ నటుడుగానేకాక ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా ఉన్నారు. 
 
ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా నవదీవ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గోవా ముఠాలకు సంబంధించిన కీలకమైన వివరాలను ఆయన నుంచి రాబట్టవచ్చని సిట్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈనేపథ్యంలో కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్‌ తీసుకున్నారా? తదితర ప్రశ్నలను సిట్‌ అధికారులు నవదీప్‌ కోసం సిద్ధం చేశారు. సిట్‌ చేతిలో నవదీప్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ మెసేజ్‌లు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.
 
మరోవైపు హైదరాబాద్‌లోని నవదీప్ నిర్వహిస్తున్న పబ్ గురించి కూడా ఆసక్తికర విషయాలను సిట్ అధికారులు కనుగొన్నట్టు సమాచారం. డ్రగ్స్ కొనుగోలు చేయలేనివారి కోసం మత్తుమందును శీతలపానీయంలో కలిపి ఓ సరికొత్త డ్రింక్‌ను సరఫరా చేస్తున్నట్టు వినికిడి. అయితే, ఈ డ్రింక్ కావాలంటే కోడ్ నంబర్ చెప్పాల్సివుంది. అపుడే ఈ డ్రింక్‌‍ను సరఫరా చేస్తారనే ప్రచారం ఎలక్ట్రానిక్ మీడియాలో జోరుగా సాగుతోంది. 
 
కాగా, ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు.