శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (09:18 IST)

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ : నేడు సిట్‌ ముందుకు హీరో నవదీప్‌

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌లో భాగంగా, నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందుకు యువనటుడు నవదీప్ రానున్నారు. ఆయన వద్ద సిట్ అధికారులు విచారణ జరుపనున్నారు. మాదకద్రవ్యాల ఆరోపణలకు సంబంధించి ఎక్సైజ్‌ ఎన్‌ఫో

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌లో భాగంగా, నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందుకు యువనటుడు నవదీప్ రానున్నారు. ఆయన వద్ద సిట్ అధికారులు విచారణ జరుపనున్నారు. మాదకద్రవ్యాల ఆరోపణలకు సంబంధించి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో పూరీ జగన్నాథ్‌, నవదీప్‌లిద్దరూ కీలకమైన వ్యక్తులుగా అధికారులు భావిస్తున్నారు.
 
దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్‌ యాక్టర్‌గానేకాక ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా కూడా చలామణీ అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తానే చేసేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో గోవా ముఠాలకు సంబంధించిన కీలకమైన వివరాలు ఇతడి నుంచి రాబట్టవచ్చని సిట్‌ అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇతడిని సుదీర్ఘ సమయం పాటు విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
 
నవదీప్ తర్వాత 25న తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26వ తేదీన చార్మి, 27న ముమైత్‌ఖాన్‌, 28న రవితేజ విచారణకు రానున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజుల వద్ద సిట్ అధికారులు వరుసగా విచారణ జరిపిన విషయం తెల్సిందే.