ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (16:19 IST)

ఐష్‌కి తర్వాత ఎమీజాక్సనే.. రోబో 2 కోసం ఎమీ చాలా కష్టపడుతుందట.. టూ పీస్‌లో..

అందాల రాశి ఐశ్వర్యారాయ్‌కి తర్వాత ఎమీ జాక్సన్‌కు భారీ ఆఫర్లు వస్తున్నాయి. లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్ 'ఎవడు'లో రామ్ చరణ్‌తో చేసిన తరువాత మళ్ళీ తెలుగులో మరో మూవీ చేయలేదు. కానీ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గల

అందాల రాశి ఐశ్వర్యారాయ్‌కి తర్వాత ఎమీ జాక్సన్‌కు భారీ ఆఫర్లు వస్తున్నాయి. లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్ 'ఎవడు'లో రామ్ చరణ్‌తో చేసిన తరువాత మళ్ళీ తెలుగులో మరో మూవీ చేయలేదు. కానీ అమ్మడు క్రేజ్  ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఎమీ ఓ క్రేజీ బిగ్ బడ్జెట్ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ - బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో శంకర్ తీస్తున్న భారీ మూవీ '2.0'లో ఎమీ హీరోయిన్‌గా చేస్తోంది.
 
అయితే ఇంతకుముందు డైరెక్టర్ శంకర్‌తో ఎమీ 'ఐ' మూవీ చేసింది. విక్రమ్ హీరోగా వచ్చిన ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయినా.. శంకర్ '2.0'లాంటి మెగా బడ్జెట్ మూవీలో ఎమీనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. అలా శంకర్ ఓ హీరోయిన్‌ని సెకండ్ టైం రిపీట్ చేసింది మనీషా కొయిరాలా, ఐశ్వర్య రాయ్‌నే. 
 
రోబో2లో ఐశ్వర్యరాయ్‌ని కాకుండా ఎమీ జాక్సన్‌ను తీసుకోవడంతో ఆమె చాలా జాగ్రత్తపడి నటిస్తుందట. మూవీ కోసం లండన్ బ్యూటీ చాలా హార్డ్ వర్క్ చేస్తోందట. మూవీలో వుండే యాక్షన్ సీన్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుందట. అలాగే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఫిట్ వుండడానికి వర్కవుట్స్ కూడా చేస్తోందట. అంతేకాదు.. రోబోలో యాక్షన్ కాకుండా గ్లామర్ రోల్స్ పోషించేందుకు కూడా అమ్మడు రెడీ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.