శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:56 IST)

సాయిపల్లవిని చూసి దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఫీలవుతున్న హీరోయిన్!

సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్

సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. 
 
అయితే, సాయిపల్లవిని చూస్తే మరో హీరోయిన్ నివేదా థామస్ వణికిపోతోందట. సాయిని చూస్తే దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఉందట. నిజానికి టాలీవుడ్‌లో నటన పరంగా దూసుకుపోతోన్న హీరోయిన్లను వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో తాజాగా నివేదా థామస్. 
 
కానీ, సాయిపల్లవిని చూసిన తర్వాత నివేదా బెంబేలెత్తిపోతోందట. ఈ సినిమా విడుదలకు ముందు దర్శక నిర్మాతలు నివేదా ఇంటిముందు క్యూ కడితే ఇప్పుడు సాయిపల్లవి ఇంటిముందు క్యూకడుతున్నారంట. తన అవకాశాలు ఎక్కడ జారి పోతాయోనని నివేదా కంగారు పడుతోందని సినీ జనాలు అంటున్నారు.