వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి సినీ నటి హేమ.. ఆర్కే రోజాకు చెక్ పెట్టేందుకు కాదట..

''మా'' ఎన్నికల సందర్భంగా హంగామా సృష్టించిన నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో బ్రహ్మానందంకు జోడీగా నటిస్తూ, కామెడీ పండించడంలో ముందుండే హేమ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏమ

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (10:37 IST)
''మా'' ఎన్నికల సందర్భంగా హంగామా సృష్టించిన నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో బ్రహ్మానందంకు జోడీగా నటిస్తూ, కామెడీ పండించడంలో ముందుండే హేమ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏమాత్రం వెనక్కి తగ్గదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించిన ఈమె.. ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా వుండే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
హేమ గతంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటి, కాపు సామాజిక వర్గం మహిళా నేతగా పేరు తెచ్చుకున్న హేమ త్వరలోనే వైకాపా తీర్థం పుచ్చుకోనుందని తెలిసింది. 
 
ఇప్పటికే హేమను పార్టీలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, పార్టీలో ప్రధాన మహిళా నేతగా ఉన్న రోజాకు చెక్ చెప్పేందుకు హేమను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ నేతలు ఖండించారు. త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో హేమ పార్టీలో చేరుతారని పార్గీ వర్గాల సమాచారం.

అన్నీ చూడండి

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్...

రాజ్‌ కుమార్‌పై పోక్సో కేసు : పోలీసులతో రూ.20 లక్షలకు డీల్?

అన్నీ చూడండి

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం

తర్వాతి కథనం
Show comments