1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 20 మే 2025 (11:03 IST)

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Prabhas getup
రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు మారుతీ సినిమా చేస్తున్నాడు. రాజా సాబ్ పేరుతో చేస్తున్న ఈ సినిమా కొంత భాగం నచ్చక రీష్యూట్ చేస్తున్న విషయం విదితమే. హైదరాబాద్ శివార్లో కేసర దగ్గర నెలకొల్పి రాజా స్టూడియోలో కొంత వర్క్ ఇటీవలే షూట్ చేస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రభాస్ తో పూర్తి స్థాయి షూట్ చేయాల్సింది. ఇందులో సంజయ్ దత్ కూడా  షూట్ లో కలవనున్నారు.
 
అయితే, రాజా సాబ్ లో ప్రభాస్ రెండు పాత్రలు పోషిస్లున్నట్లు సమాచారం. గత ఏడాది ప్రభాస్ డిఫరెంట్ లుక్ ఒకటి విడుదలయింది. అది రాజులకాలం నాటిగెటప్ గా కనిపిస్తుంది. ఇప్పడు అదే గెటప్ తో సీన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

చనిపోయిన వ్యక్తి ఆత్మ ప్రభాస్ లో ప్రవేశించనున్నట్లు విశ్వసీన వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమా కథ నుచూసుకుంటు మారుతీ గతంలో తీసిన ప్రేమకథా చిత్రమ్ పోలికలు వున్నట్లు చిత్రంలో పనిచేసిన వారు చెబుతున్నారు. అందులో లేడీ ఆత్మ ప్రవేశించి అల్లరిచేస్తూ, భయపెట్టి వినోదాన్ని పంచుతుంది. ఇప్పుడు ప్రభాస్ తో ఇంచుమించు అలాంటిదే చేయనున్నట్లు సమాచారం. 
 
ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ నాయికలుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రొమాంటిక్ హార్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతోంది.