బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (21:58 IST)

బిగ్ బాస్ షో మరీ ఇంత ఘోరమా? రేటింగ్ అలా పడిపోయిందా..?

బిగ్ బాస్ షోకు మొదట్లో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో టిఆర్పిలో ఈ ఛానల్ మొదట్లో ఉండేది. బిగ్ బాస్ షో టైంలో టివీలు చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. మిగిలిన సీరియళ్లు అస్సలు జనం చూసేవారు కాదట.
 
కొత్త కంటెస్టెంట్లు ఉన్నా వారి మధ్య సాగుతున్న వ్యవహారం బాగా ఇంట్రస్టింగ్‌గా ఉండేది. ఎలిమినేషన్ సమయంలో అయితే ఇంకా ఎక్కువగా జనం ఆసక్తిగా టివిలకు అతుక్కుపోయేవారట. అయితే ప్రస్తుతం రేటింగ్స్ చాలా పడిపోయిందట.
 
ఎక్కడో 16, 17లో రేటింగ్ ఉందంటే బిగ్ బాస్ షోకు జనం ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందన్న ప్రచారం బాగానే నడుస్తోంది. మొదట్లో కంటెస్టెంట్లు ప్రముఖులు ఉండటం.. ప్రస్తుతం నాలుగవ సీజన్లో అంతగా చెప్పుకునే వారు లేకపోవడమే రేటింగ్ పడిపోవడానికి అసలు కారణమయ్యిందట. ఇలాగే ఉంటే పూర్తిగా జనం బిగ్ బాస్ షోను చూడటం మానేసే పరిస్థితి ఉందన్న ప్రచారం జరుగుతోంది.