సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (16:15 IST)

సోనాక్షి తలచుకుంటే అది కూడా చేసేస్తుంది : జాన్ అబ్రహాం

యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ''ఫోర్స్‌2''. ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వారితో పాటు జెనీలియా డి సౌజా, తాహిర్ రాజ్ భాసిన్, నరేంద్ర

యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ''ఫోర్స్‌2''. ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వారితో పాటు జెనీలియా డి సౌజా, తాహిర్ రాజ్ భాసిన్, నరేంద్ర ఝా, పరాస్ అరోరా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు అభిన‌య్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మొదటిసారిగా జాన్ - సోనాక్షి కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్‌‌కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ, సోనాక్షిపై జాన్ అబ్రహాం పొగడ్తల వర్షాన్ని కురిపించాడు. సినిమా షూటింగ్ మొదలైన రెండో రోజున తామిద్దరం కలసి ఓ యాక్షన్ సన్నివేశంలో పాల్గొనాల్సి ఉందని... ఆ సీన్‌లో ఓ పేలుడు నుంచి తప్పించుకుంటూ తాము దూకాల్సి ఉందని... అయితే, సోనాక్షి ఎలా చేస్తుందో అని తాను కంగారుపడ్డానని... కానీ, ఏ మాత్రం భయం లేకుండా సోనాక్షి అవలీలగా చేసేసిందని జాన్ అన్నారు. సోనాక్షి తలచుకుంటే ఏమైనా చేయగలదనే విషయం తనకు అప్పుడే అర్థమైందని అన్నాడు.
 
యాక్షన్ సన్నివేశంలో మాత్రమే కాదు ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా నటించింది. షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఫలానా సన్నివేశం కష్టంగా ఉందని సోనాక్షి ఎప్పుడూ చెప్పలేదని అన్నాడు. ఎలాంటి యాక్షన్ ఫీట్లనైనా ఆమె చాలా సులువుగా చేసేస్తోందని అన్నాడు. సోనాక్షిని చూసిన తర్వాత, యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్లకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని తనకు అనిపించిందని జాన్ ఆమెని ఆకాశానికెత్తేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది.