మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (15:19 IST)

''బిగ్ బాస్'' సీజన్-2కి జూనియర్ ఎన్టీఆర్ దూరం..

''బిగ్ బాస్'' తొలి సీజన్‌లో వ్యాఖ్యాతగా అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఇక రెండో సీజన్‌లో కనిపించరట. వరుస సినిమాలతో ముఖ్యంగా బాహుబలి మేకర్ రాజమౌళి, రామ్ చరణ్ మల్టీస్టారర్‌లో నటించనున్న ఎన్టీఆర్.. బిగ్ బ

''బిగ్ బాస్'' తొలి సీజన్‌లో వ్యాఖ్యాతగా అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఇక రెండో సీజన్‌లో కనిపించరట. వరుస సినిమాలతో ముఖ్యంగా బాహుబలి మేకర్ రాజమౌళి, రామ్ చరణ్ మల్టీస్టారర్‌లో నటించనున్న ఎన్టీఆర్.. బిగ్ బాస్ షోకు దూరం కావాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 
 
జూన్‌లో బిగ్ బాస్-2 ప్రారంభం కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. ఈ షోలో జూ.ఎన్టీఆరే పాల్గొంటారని కూడా ప్రచారం సాగింది. కానీ ఈ షోను నిర్వహించేందుకు ఎన్టీఆర్ సుముఖంగా లేదని తెలిసింది. 
 
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఆ తర్వాత రాజమౌళితో సినిమా తెరకెక్కనుంది. ఈ మధ్యలో బిగ్‌బాస్‌కు డేట్స్ కేటాయించడం కుదరకపోపడంతోనే బిగ్ బాస్ సీజన్-2కు దూరమవుతున్నట్లు సమాచారం.