శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (13:05 IST)

ఎన్టీఆర్ 'టెంపర్‌'కు మూడేళ్ళు... పూరీ ఏమన్నాడంటే..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రంలో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రానికి విశేష స్పంద‌న వచ్చింది. అప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్స్‌లో ఉన్న ఎన్టీఆర్‌, పూరీల‌కి ఈ మ

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రంలో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రానికి విశేష స్పంద‌న వచ్చింది. అప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్స్‌లో ఉన్న ఎన్టీఆర్‌, పూరీల‌కి ఈ మూవీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి టెంపర్ మూవీ విడుదలై ఫిబ్రవరి 13వ తేదీకి మూడేళ్లు. ఈ మూవీని నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. 
 
ఈ సంద‌ర్భంగా పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అంతేకాకుండా టెంప‌ర్‌ సినిమా త‌న మూవీస్ లిస్ట్‌లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అంటూ ట్వీట్ చేశాడు. న‌టుడిగా ఎన్టీఆర్ నాకు ఎంతో ప్రేర‌ణ ఇచ్చాడు. ఇలాంటి మంచి క‌థ అందించిన వ‌క్కంతం వంశీకి కృత‌జ్ఞ‌త‌లు అని ట్వీట్ ద్వారా తెలిపాడు. 
 
ఇదిలావుంటే టెంప‌ర్ చిత్రం బాలీవుడ్‌లోనూ రీమేక్ కానుంది. టెంపర్‌ని హిందీలో రోహిత్ శెట్టి రీమేక్ చేయనుండగా, రణ్ వీర్ సింగ్ హీరోగా న‌టించ‌నున్నాడు. క‌థానాయిక‌గా శ్రీదేవి త‌న‌య జాన్వీని తీసుకోవాలని భావిస్తున్నార‌ట‌.