1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Gopal Varma comments on Pokiri

మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చె

Ram Gopal Varma
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చెప్పాడు. 
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఆయన కుమారుడు ఆకాశ్‌ నటిస్తోన్న 'మెహబూబా' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఛార్మి సైతం ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఈ 'మొహబూబా' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామ్‌ గోపాల్‌ వర్మ వీక్షించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ పూరీపై ప్రశంసలు వర్షం కురిపించారు. ‘మెహబూబా’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నేను చూశాను... పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ఈ సినిమాతో పోల్చితే ఫ్లాపనే చెప్పాలి... బహుశా తన కొడుకే హీరో కాబట్టి పూరీ ‘మెహబూబా’ సినిమాను ఇంత బాగా తీశారేమో. ఏదేమైనా సరే ఈ సినిమా చాలా బాగుందని ట్వీట్‌ చేశారు.

 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'పద్మావత్' విడుదలను ఆపాలంటూ థియేటర్లపై దాడులు