మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (13:08 IST)

పబ్‌లో పూరీతో కలిసి డాన్స్ చేస్తున్న చార్మీ (వీడియో)

పంజాబీ ముద్దుగుమ్మ, టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఇపుడు అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది.

పంజాబీ ముద్దుగుమ్మ, టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఇపుడు అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. 
 
కొంతకాలంగా న‌టన‌కు దూరంగా ఉంటూ పూరీ సినిమాల‌కి సంబంధించి ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు చూసుకుంటుంది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కొడుకు ఆకాశ్ హీరోగా "మెహ‌బూబా" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇండియాలోని ప‌లు ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు తన ట్విట్ట‌ర్ ద్వారా చార్మీ అందిస్తోంది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్ర బృందం అంతా క‌లిసి స‌ర‌దాగా పార్టీ సెల‌బ్రేట్ చేసుకోగా, దీనికి సంబంధించిన వీడియో కూడా బ‌య‌ట‌కి వ‌చ్చింది. తాజాగా పూరీ, చార్మి, ఆకాష్, హీరోయిన్ నేహా శెట్టి.. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ప‌బ్‌లో పార్టీ చేసుకున్నార‌ట‌. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఛార్మి త‌న దైన శైలిలో స్టెప్పులు వేయ‌గా, పూరీ కూడా వారితో పాదం క‌లిపాడు. దీనికి సంపంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.