ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (15:11 IST)

డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటే అసలు బరువెంతో తెలుసుకుని?

మైఖెల్‌ ఊల్ఫ్‌ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ జీవితాధారంగా ఫైర్‌ అండ్‌ ప్యూరీ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించి వివరించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనా

మైఖెల్‌ ఊల్ఫ్‌ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ జీవితాధారంగా ఫైర్‌ అండ్‌ ప్యూరీ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించి వివరించడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరువు గురించి చర్చ మొదలైంది. ట్రంప్ బరువెంతో తెలిస్తే  100,000 డాలర్లు ఇస్తానని ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ గన్ ప్రకటించారు‌
 
డొనాల్డ్ ట్రంప్ అంగీకరిస్తే.. ఆయన అసలైన బరువు, ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు తానే ఓ వైద్యుడిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే 100,000 డాలర్లను ట్రంప్‌ ఛారిటీకి విరాళంగా ఇస్తాను అని జేమ్స్‌ ట్వీట్‌ చేశారు. 
 
కాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక తొలిసారి ఆయనకు వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యంగానే వున్నారని వైద్యులు ప్రకటించారు. ట్రంప్‌ 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నారని ఆయన బరువు 239 పౌండ్లు ఉందని వైద్యులు రోనీ జాక్సన్‌ తెలిపారు.