''రంగూన్''లో సహజ సౌందర్యాన్ని ఒలకపోశాను.. ఓపెన్ రైలు బోగిపై డ్యాన్స్ చేశా: కంగనా రనౌత్
బోల్డ్‌గా మాట్లాడటంలో దిట్ట, అందాల సుందరి కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రంగూన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోనే తన అసలైన అందాన్ని తెరమీద దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఆవిష్కరించాడని కంగనా అంటోంది. 'రి
బోల్డ్‌గా మాట్లాడటంలో దిట్ట, అందాల సుందరి కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రంగూన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోనే తన అసలైన అందాన్ని తెరమీద దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఆవిష్కరించాడని కంగనా అంటోంది. 'రివాల్వర్ రాణి' సినిమాలో దర్శకుడు సాయికబీర్ శ్రీవాత్సవ తన ముక్కును కృత్రిమంగా చూపించాడని గతంలో వాపోయిన కంగనా రనౌత్.. రంగూన్‌లో మాత్రం.. అందాల ఆరబోతలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదని చెప్పింది.
ఇక.. ఆనందరాయ్ దర్శకత్వం వహించిన 'తను వెడ్స్ మను' సినిమాలో కంగనా ద్విపాత్రాభినయం చేసింది. రెండు పాత్రల మధ్య తేడా చూపేందుకు కంగనాకు కృత్రిమ దంతాలను అమర్చాల్సి వచ్చింది. కానీ 'రంగూన్' సినిమాలో మాత్రం తన సహజ సౌందర్యం ఒలకపోసినట్లు కంగనా హర్షం వ్యక్తం చేస్తోంది. ఓపెన్ రైలు బోగి మీద చేసే నృత్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని కంగనా రనౌత్ తెలిపింది. ఇందులో సైఫ్ ఆలీఖాన్, షాహిద్ కపూర్ సరసన తొలిసారి కంగనా జూలియా పాత్రలో నటిస్తోంది.