శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (11:36 IST)

రకుల్ ప్రీత్ సింగ్ జోరుకు బ్రేక్.. కీర్తి సురేష్‌పై కన్నేసిన మహేష్ బాబు.. కొరటాల సినిమాలో హీరోయిన్?

మహేష్ బాబు కీర్తి సురేష్ కావాలంటున్నాడట. అవునండి.. ప్రస్తుతం అందం అభినయంతో అదరగొట్టేస్తున్న కీర్తి సురేష్ పవన్ సరసన నటించే ఛాన్సు కొట్టేయడంతో.. టాలీవుడ్ ప్రిన్స్ కూడా ఆమెను హీరోయిన్‌గా తన సరసన నటింపజే

మహేష్ బాబు కీర్తి సురేష్ కావాలంటున్నాడట. అవునండి.. ప్రస్తుతం అందం అభినయంతో అదరగొట్టేస్తున్న కీర్తి సురేష్ పవన్ సరసన నటించే ఛాన్సు కొట్టేయడంతో.. టాలీవుడ్ ప్రిన్స్ కూడా ఆమెను హీరోయిన్‌గా తన సరసన నటింపజేయాలని ఉవ్విళ్లూరుతున్నాడట.

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ అడుగుపెట్టిన కీర్తి సురేష్.. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం నానితో ‘నేను లోకల్‌’ సినిమా చేస్తున్న కీర్తికి ఒక్కసారిగా భారీ ఆఫర్లు చుట్టుముట్టాయి. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కలయికలో రూపుదిద్దుకునే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఖరారైంది. 
 
దీంతో మహేష్ బాబు కూడా కీర్తి సురేష్‌పై కన్నేశాడు. మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలోనూ కీర్తినే కథానాయికగా తీసుకొన్నారని తెలుస్తోంది. దీంతో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్‌గా మారిపోయిందని.. దీంతో ప్రస్తుతం యమా జోరుమీదున్న కథానాయిక రకుల్ ప్రీత్‌కు క్రేజ్ తగ్గిపోవడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇంకేముంది? కీర్తి సురేష్ త్వరలో రకుల్ ప్రీత్ సింగ్‌ను వెనక్కి నెట్టేయనుందన్నమాట.