గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (17:23 IST)

పవన్ కల్యాణ్ సినిమాలో కేతిక శర్మ..?

kethika sharma
టాలీవుడ్‌కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కుర్ర హీరోయిన్లలో  కృతి శెట్టి, శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ పేరు బాగా వినిపిస్తోంది. రొమాంటిక్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత లక్ష్య సినిమాతోను అందంగానే అలరించింది బ్యూటీ.. ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 
 
అయితే చేసిన రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే కేతికా శర్మకు అవకాశాలు మాత్రం వస్తూనే వున్నాయి. 
 
ఇక తన మూడో సినిమాగా వస్తున్న అంగరంగ వైభవంగా పైనే కేతిక ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆమెను మరో అవకాశం వరించినట్టుగా తెలుస్తోంది. అదీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్  సినిమాలో కావడం విశేషం. 
 
పవన్ వినోదయా సితం అనే తమిళ రీమేక్‌లో చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఆయనకి జోడీగా కేతిక శర్మను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.