గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (11:27 IST)

"విక్రమ్" దండయాత్ర - రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

vikram
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విక్రమ్". లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానరులో సహ నిర్మాత ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మించారు. ఈ నెల 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మెగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 
 
కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో గత నాలుగేళ్ళుగా ఆయన ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. అంటే నాలుగేళ్ల తర్వాత విక్రమ్ రిలీజ్ అయింది. ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అదీ కూడా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగులో హీరో నితిన్ రిలీజ్ చేశారు. రూ.7.48 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరుగగా, ఈ చిత్రం 11 రోజులు పూర్తయ్యే సరికి రూ.14.40 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు.