సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (09:00 IST)

పవన్‌ అంటే అందుకే ఇష్టం : సాయిపల్లవి

saipallavi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని హీరోయిన్ సాయిపల్లవి అన్నారు. దగ్గుబాటి రానాతో కలిసి ఆమె నటించిన కొత్తచిత్రం విరాటపర్వం. ఇది ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, సాయిపల్లవి ఒక కథను ఒప్పుకుందంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలుగుతున్నందుకు చాలా ధన్యవాదాలన్నారు 
 
అలాగే, ఈ షోలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ, "పవన్ కల్యాణ్‌కు అంత క్రేజ్ ఉన్నప్పటికీ ఒక సాధారణమైన వ్యక్తి మాదిరిగానే ఆయన నడుచుకుంటారు. తన మనసులోని విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చింది. 
 
గతంలో ఒక వేదికపై సుకుమార్ మాట్లాడుతూ సాయిపల్లవిని 'లేడీ పవర్ స్టార్' అంటూ కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులు ఆమెను అలాగే పిలుస్తున్నారు కూడా. రేపు జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుకుమార్ కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే.