చనిపోయేంత వరకు నగ్న సెల్ఫీలు పోస్ట్ చేస్తూనే ఉంటా : కిమ్ కర్దాషియన్
కిమ్ కర్దాషియన్ నగ్న సెల్ఫీ ఒకటి దిగి దాన్ని ట్విట్టర్లో షేర్ చేసి సంచలనం సృష్టించింది. నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తేంకాదు. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తూ ఇలా దుస్తులు తీసేసిన ఫోటోలు పెడుతోందని కొందరు మండిపడుతుంటే.. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం కిమ్‌ని ఆదర్శంగా తీసుకుని.. తమ న్యూడ్ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు.
తన న్యూడ్ సెల్ఫీలతో అభిమానులకు, నెటిజన్లకు పిచ్చెక్కించే కిమ్ కర్దాషియన్ అభిమానులకు సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. సెల్ఫీ క్వీన్‌గా పాపులర్ అయినా ఈ భామ తాను చనిపోయే వరకు అభిమానులకు "న్యూడ్ సెల్ఫీలు" పోస్టు చేస్తానని ప్రతిజ్ఞ చేసింది.
తాజాగా ఈ సోగకళ్ల సుందరి "బ్రేక్ ద ఇంటర్నెట్" అవార్డును అందుకుంది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రధానోత్సవంలో ఫస్ట్ టైం ప్రకటించిన ఈ అవార్డును కిమ్ కర్దాషియన్‌కు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు ఈ అవార్డు రావడానికి అభిమానులే కారణం అని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అంతేకాక అభిమానుల కోసం తాను జీవితాంతం నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించింది.