శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 27 జులై 2017 (19:39 IST)

మళ్లీ మీతో రెండోసారా...? నో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్... ఎవరికి?

రకుల్ ప్రీత్ సింగ్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో క్రేజీ స్టార్. ఈమె ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు సరసన స్పైడర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. స్పైడర్ చిత్రం దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో ఆ చిత్ర దర్శ

రకుల్ ప్రీత్ సింగ్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో క్రేజీ స్టార్. ఈమె ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు సరసన స్పైడర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. స్పైడర్ చిత్రం దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో ఆ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సెక్సీ నటి రకుల్ ప్రీత్ ముందు మరో రిక్వెస్ట్ పెట్టాడట. అదేంటయా అంటే... తన తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటించాలని కోరాడట.
 
ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందనీ, ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ పవర్‌ఫుల్‌గా వుంటుందనీ చెప్పాడట. అంతా విన్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్... సింపుల్ గా 'నో' అని చెప్పేసిందట. కారణం ఏంటని అడిగితే... ప్రస్తుతానికి తను వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నట్లు చెప్పిందట. ఐతే అసలు కారణం మాత్రం వేరే వుందట. ఇటీవలి కాలంలో హీరో విజయ్ చిత్రాలు వరుసగా పరాజయాలు పొందుతుండటం వల్లనే రకుల్ నో చెప్పినట్లు తెలుస్తోంది.