ఇష్టమైన బాయ్స్‌తో డాన్స్ చేస్తూ అలరిస్తున్న లక్ష్మీ మంచు
లక్ష్మీ మంచు ఫైర్ బ్రాండ్. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఆమె నటించిన సినిమాల్లోని పాత్రలు కూడా అలాగే వుంటాయి. అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఆమె పెక్యురల్ లేడీ విలన్ గా నటించింది మెప్పించింది. తాజాగా ఆమె మలయాళ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే కోచి బీచ్‌లో ఆమె యాక్షన్ సన్నివేశాలను కూడా చేసింది. ఇటీవలే దానికి సంబంధించిన పొటోలను పెట్టి అభిమానులను అలరించింది.
తాజాగా నేడు సోషల్ మీడియా ద్వారా డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. చక్కటి అరబిక్ మ్యూజిక్‌తో శ్రావ్యంగా స్టెప్‌లు వేస్తూ కనిపించింది. ఇద్దరు అబ్బాయిలు కూడా ఆ డాన్స్‌లో జత కట్టారు. నాకు ఇష్టమైన అబ్బాయిలతో డాన్స్ చేస్తున్నానంటూ కాప్టన్ పెట్టింది. లక్ష్యరాజానంద్ దర్శకత్వం చేసిన ఈ థీమ్‌కు సిద్దు బూయ్ అంటే తెలిపింది. ఈమె సంతోషం చూసిన రకుల్ ప్రీత్ సింగ్ నా క్రేజీ.. పీప్స్ అంటూ కామెంట్ చేసింది.