సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (21:05 IST)

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నభా నటేష్

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జోరు మీదుంది. వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో ‘సోలో బతుకే సో బెటర్’ బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదర్స్’ సినిమాలు చేస్తున్న నభా మరో క్రేజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది.
 
యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో ఫీమేల్ 
లీడ్‌గా అతనితో రొమాన్స్ చేయబోతుంది. ఇస్మార్ట్ శంకర్‌తో యూత్‌లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నభా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటుంది.
 
అంధాదున్ ఒరిజినల్‌లో రాధికా ఆప్టే చేసిన రోల్‌ను నభా చేస్తుండటంతో ఎక్జయిటెడ్‌గా 
ఉంది. రెండుమూడు సినిమాలతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నభా త్వరలోనే 
టాప్ లీగ్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.