సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2020 (18:00 IST)

నా కలల రాకుమారుడు అతడే, నభా నటేష్

నభా నటేష్ చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమెకి యూత్‌లో మంచి ఫాలోయింగే ఉంది. తనలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని ఆమే స్వయంగా చెబుతోంది. నేను ఏదైనా ముఖం మీదే మాట్లాడేస్తాను. ఎవరికీ భయపడను. ముందు ఒక మాట వెనుక మరో మాట మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అలాంటి వారంటే అస్సలు నాకు నచ్చదు. వారెవరో తెలిస్తే మాత్రం వెంటనే వారిని పక్కన పెట్టేస్తాను. 
 
అయితే నేను సినిమాల్లోకి రాకముందు నాకు షారుక్ ఖాన్ అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. స్కూల్, కాలేజీ వయస్సులో ఆకర్షణ అనేది మామూలే. నాకు మాత్రం షారుక్ ఖాన్ మీదే అదంతా ఎక్కువగా ఉండేది.
 
నా కలల రాకుమారుడు ఆయనే అంటూ చెప్పేసింది నభా. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.