బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 15 జూన్ 2019 (22:34 IST)

మిద్దెపై నుంచి దూకిన నటుడు నాగశౌర్య.. ఎందుకు.. ఏమైంది?

తెలుగు సినీపరిశ్రమలో యువనటులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. మొదటగా రాంచరణ్,  జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత నాని, తాజాగా నాగశౌర్య. వీరందరి కన్నా నాగశౌర్యకు గాయాలు ఎక్కువయ్యాయి. అది కూడా షూటింగ్ సమయంలోనే. 
 
ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ వైజాగ్‌లో వేగంగా జరుగుతోంది. కేజీఎఫ్‌ ఫేమ్ అంభరివ్ ఈ సినిమాలో ఫైట్స్ కంపోజ్ మాస్టర్. నాగశౌర్యతో ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఫైట్ షాట్‌లో 15 అడుగుల మిద్దె నుంచి నాగశౌర్య కిందకు దూకాలి.
 
డూప్‌ను పెట్టుకుందామని సినిమా యూనిట్ నాగశౌర్యకు చెప్పింది. అయితే నాగశౌర్య ఒప్పుకోలేదు. రిస్క్ అయినా నేనే చేస్తానన్నాడు. అయితే షూటింగ్ జరిగే సమయంలో పట్టుతప్పి కిందపడిపోయాడు. దీంతో నాగశౌర్య కాలికి బాగా గాయమైంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడునెలల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. దీంతో షూటింగ్ కాస్తా ఆగిపోయింది.