శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (19:00 IST)

నిలోఫర్ వైద్యుడి వేధింపులు.. నర్సు దుస్తులు మార్చుకుంటుంటే..?

మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. బస్సుల్లో, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా నిలోఫర్ ఆస్పత్రి డాక్టర్ ఓ నర్సును వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిలోఫర్ వైద్యుడి వ్యవహారం బట్టబయలైంది. 
 
నాంపల్లికి చెందిన ఓ మహిళ నిలోఫర్‌ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. అదే ఆస్పత్రిలో ఆర్ఎంఓ, నాట్కో బిల్డింగ్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ రమేష్ తన కింద పని చేస్తున్న నర్సును అదే పనిగా వేధించాడని, డబుల్ మీనింగ్ కామెంట్స్ చేసేవాడని.. బాధితురాలు వెల్లడినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. 
 
ఈ నెల 22వ తేదీన మరో నర్సుతో కలిసి వాష్ రూమ్ వెళ్లినా దూషించాడని.. అతని గదికి రమ్మని వివరణ ఇవ్వాలని వేధించాడని బాధితురాలు పోలీసులతో తెలిపింది. విధి నిర్వహణలో భాగంగా దుస్తులు మార్చుకుంటుంటే కూడా డ్రెస్సింగ్ రూమ్ వద్ద నిల్చుని తొంగి చూసేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై సదరు నర్సు తన భర్తతో కలిసి మంగళవారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.