శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (21:19 IST)

మహిళ కడుపులో టూత్‌బ్రష్ .. సర్జరీ లేకుండానే తొలగింపు.. ఎలా?

మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులోకి టూత్ బ్రష్ ఒకటి వెళ్లిపోయింది. దీన్ని ఎలాంటి ఆపరేషన్ లేకుండానే వైద్యులు తొలగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లోని లోయర్ మాప్రెమ్‌కు చెందిన ఓ 50 యేళ్ళ మహిళ ఉదయాన్ని దంతాలను టూత్‌బ్రష్‌తో శుభ్రం చేసుకుంటూ పొరపాటున దాన్ని మింగేసింది. 
 
ఆ తర్వాత ఆమె నెల రోజుల పాటు ఎలాంటి అనారోగ్యానికిగురికాలేదు. అయినప్పటికీ ఆమె వైద్యులను సంప్రదించి, జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వైద్యులు ఆమెకు ఎలాంటి ఆపరేషన్ చేయకుండా ఆ టూత్‌బ్రష్‌ను వెలికితీశారు.

దీనిపై ఆమెకు చికిత్స అందించిన సివిల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఇసాక్ సయీమ్ స్పందిస్తూ, 'షిల్లాంగ్‌లో ఇటువంటి చికిత్స అందించడం మొదటిసారి. ఆమె కడుపులో టూత్‌బ్రష్‌ ఉందని తెలుసుకుని మొదట తామంతా ఆశ్చర్యానికి గురయ్యాం. 

ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే ఎండోస్కోప్‌ను వినియోగించి ఆమె నోటి ద్వారా ఈ బ్రష్‌ను బయటకు తీసినట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో సర్జరీ అవసరం రాలేదు. చికిత్స చేసిన అనంతరం గంటన్నరకే ఆమెను డిశ్చార్జ్‌ చేశాం. బ్రష్‌ను వెలికి తీసిన తర్వాత ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది' అని చెప్పారు.