శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:20 IST)

నువ్వు గర్భవతివా...? పో... పో.. అంటూ తరిమేసిన డాక్టర్...

మూడు నెలలు  కాపురం చేశాడు.. గర్భవతి అని తెలియగానే ఇంటి నుంచి తరిమేశాడు ప్రభుత్వ వైద్యుడు. ప్రేమించానన్నాడు. పెళ్ళి చేసుకుని ఏడడుగులు నడిచాడు. మూడు నెలలు కాపురం చేశాడు. భార్య గర్భవతి అని తెలియగానే వదిలించుకునేందుకు కట్నం కావాలంటూ వేధింపులకు గురిచేశాడు. తిరుపతికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి నిర్వాకమిది.
 
రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు డాక్టర్ బాబు అలెగ్జాండర్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన ఇందిర అనే యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇందిర అనాధ. ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి మామయ్య దగ్గరే ఉంటోంది. మూడు నెలల పాటు కాపురం చేసిన వైద్యుడు ఆ అమ్మాయి గర్భవతి అని తెలియగానే వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. 
 
రూ. 10 లక్షల కట్నం, 30 సవర్ల బంగారం తీసుకురావాలని ఆమెను వేధించాడు. వైద్యుడు బాబుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఆమెను వేధించారు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో  మీడియాను ఆశ్రయించింది. న్యాయం జరుగకపోతే ఆత్మహత్యే శరణ్యమంటోంది బాధితురాలు.