తల్లి కాబోతున్న టాప్ యాంకర్...
తెలుగు టీవీ రంగంలో తక్కువకాలంలో క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లలో లాస్య కూడా ఒకరు. చిలిపితనం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లాస్య రవితో కలిసి చాలా షోలను వినోదభరితంగా నడిపించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో కలిసి చేయకూడదని నిర్ణయించుకున్నాక, లాస్య జోరు కాస్త తగ్గింది. ఆ సమయంలో మంజునాథ్‌ను వివాహం చేసుకుని అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో చేయడం లేదు. తాజా రెండో వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న తరుణంలో మరో శుభవార్తను ఆమె ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
10 సంవత్సరాల పరిచయం..9 సంవత్సరాల ప్రేమ బంధం..2 సంవత్సరాల పెళ్లి బంధం..అంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో పాటు తాను తల్లిని కాబోతున్నట్లు తెలుపుతూ ఫోటోలను పోస్ట్ చేసింది లాస్య. ఈ ఫోటోలలో లాస్య, మంజునాథ్‌లు ఎంతో అన్యోన్యంగా మరియు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బుల్లి వారసుడో, వారసురాలో వస్తే వీరి సంతోషం డబుల్ అవుతుంది. ఈ వార్త వినగానే ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.