శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:13 IST)

కౌషల్ పాపులారిటీకి ఏమైంది...? పుల్వామా కోసం 1కె రన్.. ఓవరాక్షన్?

బిగ్ బాస్ సీజన్ 2లో ప్రతి రోజూ ఏదో ఒక విధంగా వార్తలకెక్కుతూ నిత్యం వివాదాలతో దోస్తీ చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి కౌషల్. ఎంత పాపులారిటీ అంటే అతని పేరిట ఏకంగా ఆర్మీనే రెడీ అయ్యింది. ఇక కౌషల్ బిగ్ బాస్ ఇంట్లో ఉండగా ఈ ఆర్మీ ఎంతో క్రియాశీలంగా పనిచేస్తూ అతని పేరు మీద ఈవెంట్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా అతనికి పోటీ ఇస్తున్న కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్ చేస్తూ అతనిని పెద్ద సపోర్ట్‌గై నిలిచారు. 
 
ఎట్టకేలకు టైటిల్ చేజిక్కించుకుని, తన క్రేజ్ బాగా ఉపయోగించుకోవాలని చూసాడు. ఇక బయటికి వచ్చాక విదేశీ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇస్తున్నట్లు, టాప్ హీరోల సినిమాలో అవకాశాలు వెల్లువెత్తినట్లు నానా హంగామా జరిగింది. కానీ అంతా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
 
కాలం గడిచే కొద్దీ ఇప్పుడు అందరూ అతనిని మర్చిపోయారు, కానీ ఏదోలా వార్తలలో ఉండాలని అడపాదడపా ప్రయత్నిస్తూనే ఉన్న కౌషల్ తాజాగా జరిగిన పుల్వామా ఘటనపై 1కె ర్యాలీ నిర్వహించారు, ఇందులో భాగంగా ఎమోషనల్ వీడియో మెసేజ్ ఒకటి పెట్టారు. అందులో అతను చేసిన ఓవరాక్షన్ తక్కువగా ఏమీ లేదు. 
 
ఇక ఈ 1కె రన్‌కి కూడా పెద్దగా జనాల నుండి స్పందన రాలేదంట. ఈ ఐడియా వర్క్అవుట్ కాకపోయేసరికి 50 వేల రూపాయలను ఐజీకి అందించి, ఆ సందర్భంగా తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోను అన్నింట్లో షేర్ చేస్తున్నాడంట.