గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (16:56 IST)

బిగ్ బాస్ తర్వాత కౌశల్‌కు రాని అవకాశాలు.. ఆర్మీ నిర్మాణంలో?

బిగ్ బాస్ రెండో సీజన్ విజేతగా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షోకు తర్వాత సినీ అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ కౌశల్‌కు అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ బిగ్ బాస్‌లో వున్నప్పుడు తనకు సపోర్ట్ చేసిన ఆర్మీనే టార్గెట్ చేస్తూ.. ఓ సినిమాలో నటించనున్నాడు. 
 
కౌశల్ ఆర్మీ నిర్మించే సినిమాలో కౌశల్ హీరోగా నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో ఓ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి దీని ద్వారా సేవ చేయాలని భావిస్తున్నారు. కానీ సేవా కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం కౌశల్ ఆర్మీ ఫౌండేషన్‌ని నిర్మాణ రంగంలోకి కూడా దింపుతున్నారు. ఆ సంస్థకి వచ్చిన విరాళాలతో సేవా కార్యక్రమాలు చేస్తూ సినిమాలు కూడా చేస్తారని టాక్.