శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:41 IST)

స్టైల్ కోసం వెంట్రుకలకు రంగు వేసుకుంటే తల 5 సెంమీ వాచిపోయింది.... (ఫోటోలు)

మరింత అందంగా కనిపించాలని భావించిన ఓ యువతి తల వెంట్రుకలకు రంగు (హెయిల్ డై) వేసుకుంది. తెల్లారే సరికి ఆమె తల ఐదు సెంటీమీటర్ల మేరకు వాచిపోవడంతోపాటు తల రకరకాలుగా వంకర్లు తిరిగిపోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ యువతి స్టైల్ కోసం హెయిర్ డై వేసుకుంది. అది కాస్తా బెడిసికొట్టి ఆమె మొహమంతా వాచిపోయింది. దీనిపై ఆ యువతి స్పందిస్తూ, రాత్రి పార ఫెనలీన్‌ డయమీన్(పీపీడీ) హెయిర్ డై వేసుకున్నాను. ఉదయానికల్లా తన తల ఐదు సెంటీమీటర్ల వరకు వాచిపోవడంతో పాటు తల రకరకాలుగా వంకర్లు తిరిగిపోయింది.
 
వెంటనే హాస్పటల్‌కు వెళ్లడంతో డాక్టర్లు తగిన చికిత్స చేసి తన ప్రాణాలు కాపాడారని చెప్పింది. ఇక పీపీడీ ఉన్న హెయిర్ డై.. కణజాలాన్ని దెబ్బతీయడం, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యల్లాంటి తీవ్రమైన రోగాలకు కారణం కావొచ్చని వైద్యులు తెలిపారు. హెన్నాతో పాటు చాలా హెయిర్ డై‌లో పీపీడీ అనే రసాయన పదార్థం ఉంటుందని, ఇది వికటించడం వల్లే ఇలాంటి అలార్థాలు జరుగుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.