మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (15:37 IST)

వన్‌సైడ్ లవ్.. ప్రేమకు అంగీకరించలేదని.. కత్తితో పొడిచేశాడు..

తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించని పాపానికి ఓ యువతి బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా, వళ్లియూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ హాస్టల్‌లో బసచేస్తూ.. ఉద్యోగం చేస్తూ వచ్చిన మెర్సీ (21)ని తిరుకురుక్కడి చెందిన రవి అనే వ్యక్తి ప్రేమించాడు. కానీ రవిని మెర్సీ ప్రేమించలేదు. 
 
దీంతో ఆగ్రహానికి గురైన రవి.. మంగళవారం రాత్రి 6.30 గంటలకు ఆమె పనిచేసే షాపుకెళ్లి.. వెనుక నుంచి కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో మెర్సీ తీవ్రంగా గాయాలపాలైంది. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఇక పారిపోయేందుకు ప్రయత్నించిన రవిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.