ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (15:47 IST)

భార్యకు సెలైన్ ద్వారా హెచ్ఐవీ వైరఎస్ ఎక్కించిన భర్త

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య పట్ల కట్టుకున్న అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సెలైన్ ద్వారా హెచ్ఐవీ వైరస్ ఎక్కించాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. పూణె పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులోని విషయాలను పరిశీలిస్తే, 
 
తనకు 20015లో హోమియోపతి డాక్టరుతో వివాహమైంది. పెళ్లి సమయంలో బాగానే కట్నకానుకలు ఇచ్చామని తెలిపారు. కానీ, పెళ్లి జరిగిన రెండుమూడు నెలల తర్వాత అదనపు కట్నకానుకల కోసం పోలీసులు వేధించసాగారు. 
 
అయితే, తన భర్త గత యేడాది తాను అనారోగ్యం పాలైనప్పుడు సైలెన్‌ ఎక్కించాడని, అందులో హెచ్‌ఐవీ వైరస్‌ సోకిన వారి రక్తం కలిపాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు భర్త విడాకులు కావాలని వేధిస్తున్నాడని వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పందిస్తూ, 'ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధితురాలు మళ్లీ అనారోగ్యం బారినపడినపుడు పరీక్షలు చేయగా అమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నట్లు మొదటిసారిగా తెలిసింది. అదేసమయంలో భర్తకూ పరీక్ష చేస్తే నెగటివ్‌ అని తేలింది. తర్వాత ఇటీవల మేం భార్యాభర్తలిద్దరికీ ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించగా.. ఇద్దరికీ హెచ్‌ఐవీ వైరస్‌ సోకినట్లు తేలింది. అంతకుముందు వారు ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేయించుకున్నప్పుడు కేవలం భార్యకు మాత్రమే వైరస్‌ సోకినట్లు వెల్లడైంది' అని పోలీసులు వెల్లడించారు.