సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:35 IST)

ఆందోళన ఎక్కువై కిలోల కొద్దీ రాళ్లు, బోల్ట్‌లు తినేశాడు..

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పరిస్థితుల ప్రభావాల వల్ల మనిషి జీవనంలో రోజు రోజుకు ఆందోళన, కంగారు పెరిగిపోతున్నాయి. వాటిని అధిగమించేందుకు కొందరు నచ్చిన ప్రదేశాలకు వెళ్తుంటారు, మరికొంత మంది ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం వంటివి చేస్తుంటారు. కొందరు సంగీతం వింటారు.


మరికొందరు పుస్తకాలు చదువుతారు. కానీ కొరియాలో ఒక వ్యక్తి ఎవరూ ఊహించలేని విధంగా సొంత వైద్యం చేసుకున్నాడు. అది కాస్తా ప్రాణాల మీదకు వచ్చేసరికి వైద్యుల వద్దకు పరుగులు తీశాడు.
 
వివరాలల్లోకెళితే, కొరియాకు చెందిన ఒక వ్యక్తి కొన్నేళ్లుగా ఆందోళనతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి చిన్న సంఘటనలకు, విషయాలకు తీవ్రంగా ఆందోళనకు గురవ్వడంతో ఏమి చేయాలో తెలియక ఇంట్లో ఏ చిన్న వస్తువు కనబడ్డా వాటిని మింగేవాడు. కొన్నాళ్ల పాటు ఇలా చేసాడు. ఈ క్రమంలో మనిషి అరుగుదల వస్తువులను చూర్ణం చేసే శక్తి లేకపోవడంతో పొట్ట ఉబ్బరంగా అయిపోయి నొప్పి ఎక్కువైంది. 
 
నొప్పి తట్టుకోలేక డాక్టర్‌ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు పొట్టలో రెండు కిలోల రాళ్లు, పిన్నులు, బోల్టులు, మూతలు, రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా వాటిని నోటి గుండా తొలగించడానికి ప్రయత్నం చేసారు. ఎక్కువ మొత్తంలో వస్తువులు ఉండగా అలా చేయడం వీలు కాకపోయే సరికి మరో మార్గం లేక సర్జరీ ద్వారా వాటన్నింటినీ తొలగించారు. 
 
పెయాంగ్ వాహ్ అనే వైద్యుడు ఈ విషయాన్ని తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేర్ రిసార్ట్స్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేసారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.