శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (16:05 IST)

స్మార్ట్‌ఫోనుకు ఛార్జింగ్ పెడుతూ.. యువకుడు మృతి.. ఎలా?

స్మార్ట్ ఫోన్లు లేనిదే చాలామందికి పొద్దు గడవదు. ఇలా ఓ యువకుడు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్‌తో తిరుగుతూ తిరుగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోనుకు ఛార్జింగ్ పెడుతుండగా ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... మన్నెగూడ గ్రామానికి చెందిన గునుకుల నరేష్‌(24) శనివారం రాత్రి ఇంట్లో చరవాణికి ఛార్జింగ్‌ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. నరేష్‌ను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినా లాభం లేకపోయింది. మార్గమధ్యలోనే నరేష్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. 
 
మన్నెగూడ గ్రామంలో విద్యుత్తు సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు తలెత్తుతున్నాయని.. గతంలోనూ ఇలా హై వోల్టేజ్ సరఫరాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.