శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (17:00 IST)

ఇదే నిజమైతే అటు ప్రిన్స్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమో...?

మహేష్‌ బాబు భార్యగా నమ్రత కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ నటనకు దూరమయ్యారు. కొడుకు, కుమార్తెలను చూసుకోవడంతో ఇన్నాళ్ళు గడిపిన ఆమె మహేష్‌ చిత్రాలకు కాస్టూమ్‌ డిజైనర్‌గా కూడా వ్యవహరించారు. బయట కొన్ని ఫంక్ష

మహేష్‌ బాబు భార్యగా నమ్రత కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ నటనకు దూరమయ్యారు. కొడుకు, కుమార్తెలను చూసుకోవడంతో ఇన్నాళ్ళు గడిపిన ఆమె మహేష్‌ చిత్రాలకు కాస్టూమ్‌ డిజైనర్‌గా కూడా వ్యవహరించారు. బయట కొన్ని ఫంక్షన్లకు అటెండ్‌ అయినా.. నటన విషయంలో చేసేది లేదని తేల్చి చెప్పేవారు.
 
అయితే మళ్ళీ సినిమాల్లో నటించడానికి సమాయత్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్నీ ఆమే స్వయంగా వెల్లడించారు. ఓ పెద్ద క్రేజీ సినిమాలో నటిస్తున్నానని స్పష్టం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా అని గుసగుసలు విన్పిస్తున్నాయి. అదే నిజమైతే నిజంగానే పెద్ద క్రేజే అవుతుంది కదూ. అటు ప్రిన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమో...?