ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (11:21 IST)

దర్శకుడు బాబీ చిత్రంలో యంగ్ బాలకృష్ణ స్టెప్ లేస్తున్నాడు

balakrishna
balakrishna
నందమూరి బాలకృష్ణ అంటేనే రెండు పాత్రలు వుంటేనే కథలో కిక్ వుండదు. తాజాగా దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో యంగ్ బాలకృష్ణతో ఓ సాంగ్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో యూత్ ను అలరించేవిధంగా ఈ సాంగ్ వుంటుందట. ఇప్పటికే కొొంత యాక్షన్ పార్త్ కూడా చిత్రీకరించినట్లు సమాచారం.
 
ఫిలింసిటీ సమీపంలోని ఓఆర్ఆర్. దగ్గర భారీ యాక్షన్ పార్ట్ తీయనున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సీన్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోంది అని తెలుస్తోంది. కుటుంబకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో సమకాలీన రాజకీయ అంశం కూడా టచ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాలో కథరీత్యా సంజయ్ దత్ నటించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య  నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖండ దర్శకుడు బోయపాటి తో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత వెల్లడించారు.