ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:56 IST)

నందమూరి బాలకృష్ణ చిత్రం తాజా అప్ డేట్

Balakrishna, direcotr boby
Balakrishna, direcotr boby
కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తాజా సినిమా దర్శకుడు బాబీ నేత్రుత్వంలో జరుగుతోంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం హైదరాబాద్ లో ఓ స్టూడియో వేసిన సెట్ లో కొంత పార్ట్ తీశారు. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నందమూరి బాలకృష్ణ కొంత విరామంతీసుకుని ఏప్రిల్ లో మరో షెడ్యూల్ లో చేరనున్నారు. శ్రద్దా శ్రీనాథ్ ఇందులో ఓ పాత్ర పోషిస్తుంది. బాలయ్యకు తగిన విదమైన కథను బాబీ ఎప్పటినుంచో తయారుచేసుకున్నారు. ఇప్పటికి సిద్ధమైంది.
 
ఇక అఖండ 2  గురించి కొత్త అప్ డేట్ రాబోతుంది. నిర్మాత రవీంద్ర ఇటీవలే దీనిపై క్లారిటీ ఇస్తూ త్వరలో మంచి న్యూస్ వింటారని తెలిపారు. మాటల రచయిత ఏం రత్నం డైలాగ్స్ పూర్తి చేశాడని తెలుస్తోంది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయట. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయట. మరోవైపు బాలయ్య రాజకీయాల్లో బిజీగా వుండనున్నందున ఏప్రిల్ లో ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది.