ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ పాత్ర పోషించింది ఎవరు..?
నందమూరి తారక రామారావు జీవిత కథతో రూపొందుతోన్న సంచలన చిత్రం ఎన్టీఆర్. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక జరిగినప్పటి నుంచి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే... యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ వేడుకలో మాట్లాడుతూ... ఈ మూవీలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషించారో తెలుసుకోవాలని ఇంట్రస్ట్‌గా ఎదురుచూస్తున్నాను అన్నారు.
అనిల్ రావిపూడి అలా మాట్లాడినప్పటి నుంచి అందరిలో ఒకటే ప్రశ్న. బాలయ్య పాత్రను పోషించింది ఎవరు..? అని. బాలకృష్ణ చిన్నప్పటి పాత్రను ఆయన మనవడు చేస్తున్నాడని తెలిసింది. మరి.. బాలయ్య హీరో అయ్యాక ఆ పాత్రను బాలయ్య తనయుడు మోక్షజ్ఞ చేయనున్నారని ప్రచారం జరిగింది కానీ.. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. అయితే… తాజా సమాచారం ప్రకారం… బాలయ్య పాత్రలో బాలయ్యే నటించాడట. అంటే… బాలయ్య ద్విపాత్రాభినయం చేసారన్నమాట. ఇది నిజమో కాదో చూడాలి మరి..!