శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (18:49 IST)

సంక్రాంతి 2019 మూవీస్ : విజేత ఎవరో?

తెలుగు పండుగల్లో అతి ప్రధానమైన పండుగ సంక్రాంతి. దీన్నే పెద్ద పండుగగా పిలుస్తారు. అలాంటి సంక్రాంతికి పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి సంక్రాంతికి రేసులో నిలిచే చిత్రాలు విడుదలైన తర్వాత యావరేజ్ అని టాక్ తెచ్చుకుంటే చాలు.. కలెక్షన్ల పంటపండినట్టే. ఇక హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ రేంజ్ వసూళ్లు ఖాయం. అందుకే సంక్రాంతి సీజన్‌పై ఎప్పుడూ కొందరు హీరోలు ప్రత్యేక దృష్టిపెట్టి తమ సినిమాలను సిద్ధం చేస్తుంటారు. 2018లో పలువురు స్టార్ హీరోల చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిస్తే.. వచ్చే యేడాది కూడా పలు సిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
 
ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు) 
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం తొలి భాగం 'కథానాయకుడు'. జనవరి 9వ తేదీన విడుదలకానుంది. బాలయ్య ప్రతి యేడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడం ఆనవాయితీ. ఈ యేడాది కూడా 'ఎన్టీఆర్ కథానాయకుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
 
వినయ విధేయ రామ 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం "వినయ విధేయ రామ". బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుంటే, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత సంక్రాంతికి బాలయ్యతో మెగాస్టార్ చిరంజీవి పోటీపడితే, ఈ యేడాది రామ్ చరణ్ సై అంటున్నారు.
 
ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) 
ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి థియేటర్లలో సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన చిత్రం "ఎఫ్2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). జనవరి 12వ తేదీన విడుదలకానుంది. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత పురుషుడి జీవితం ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తెరక్కించారు. ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో స్పెషల్‌గా అట్రాక్ట్‌గా నిలిచింది. వీటితోపాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకురానున్నాయి. మరి ఏ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందో వేచిచూడాల్సిందే.