సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (20:06 IST)

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లైవ్... చెడ్డవాళ్లను కూడా మంచివాళ్లుగా చూపించావేమో... కలెక్షన్ కింగ్

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు ఆడియో వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో అతిరథమహారథులు పాల్గొన్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ... ''సోదరుడు బాలయ్య నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. నిజాలు మాట్లాడాలా...అన్నయ్యకు నాకు వున్న అనుబంధం చెప్పలేనిది. మద్రాసులో చదువుతున్నప్పుడు, 100 మందిలో అన్నయ్యకు నమస్కారం పెట్టినవాడిని.
 
1993లో మేజర్ చంద్రకాంత్ తీశాను. ఓ రాజకీయ మీటింగుకు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ డౌన్ డౌన్ అని అంటే నేను ఒక్కడినే ఎన్టీఆర్ జిందాబాద్ జిందాబాద్ అన్నాను. 1994లో షిర్డీకి తీసుకెళ్లాను. మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్నాను. ఆ తర్వాత అన్నయ్య నాకు చెప్పారు. ఆ మాటలు కొన్ని చెప్పలేను.
 
లంచం అనే పదానికి అర్థం తెలియని నటుడు ఎన్టీఆర్. ఈ చిత్రం ట్రెయిలర్ చూస్తుంటూ నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. క్రిష్ ఈ చిత్రం ఎక్కడ ప్రారంభించావో... ఎక్కడ ముగించావో.. చెడ్డవాళ్లను కూడా మంచివాళ్లుగా చూపించావేమో నాకు తెలియదు. కానీ ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ శెలవు'' అన్నారు.