సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (17:36 IST)

బసవతారకం హార్మోనియం వాయిస్తుంటే.. ఎన్టీఆర్ అలా చూస్తూ.. (ఫోటో)

ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా బసవతారకం పాత్ర అవుట్ అయ్యింది. నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బసవతారకం పాత్ర వచ్చేసింది. బసవతారకం హార్మోనియం వాయిస్తూ వుంటే.. ఆమె పక్కనే ఎన్టీఆర్ కూర్చుని ఆమె కళ్లల్లోకి చూస్తున్నట్లు వున్న పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఎన్టీఆర్, బసవతారకం దంపతుల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతోంది. 
 
బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయింది. ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం సాయంత్రం జరుగనుంది. ఫిలిమ్ నగర్‌లో జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతోంది. తొలి భాగమైన కథానాయకుడు జనవరి 9న విడుదల కానుండగా, రెండో భాగమైన ''మహానాయకుడు'' ఫిబ్రవరి ఏడో తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.