బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (09:00 IST)

జయలలితగా విద్యాబాలన్.. భారీ బడ్జెట్‌తో 'అమ్మ అంటే ప్రేమ'

దివగంత సినీ నటి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఆమె పేరుతో "ది ఐరన్ లేడీ" అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయలలితగా నిత్యామీనన్ నటిస్తుండగా, ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, ప్రముఖ దర్శకుడు భారతీ రాజా దర్శకత్వంలో కూడా మరో చిత్రం తెరకెక్కనుంది. 
 
ఇదిలావుంటే, భారీ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్ మరో చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జయలలిత పాత్రను విద్యాబాలన్ పోషించనుంది. ఇప్పటికే స్క్రిప్టులు పూర్తికాగా, మిగిలిన పాత్రల కోసం పలువురు సినీ ప్రముఖుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ప్రముఖ హీరో అవింద్ స్వామి అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 
 
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన జయలలిత పుట్టినరోజైనా ఫిబ్రవరి 24వ తేదీన వెల్లడయ్యే అవకాశం ఉంది. పైగా, ఈ చిత్రానికి "అమ్మా ఎండ్రాల్ అన్బు" (అమ్మ అంటే ప్రేమ) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తికావడంతో 2019 డిసెంబరు నాటికి చిత్ర షూటింగ్ పూర్తి చేసి జయలలిత పుట్టినరోజైన 2020 ఫిబ్రవరి 24వ తేదీన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.