సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:35 IST)

ఎన్టీఆర్ ఆడియో రిలీజ్‌కి తార‌క్ వస్తున్నాడా..?

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్.బి.కే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పైన ఈ చిత్రాన్ని బాల‌కృష్ణ స్వ‌యంగా నిర్మిస్తుండ‌టం విశేషం. ఎన్టీఆర్ మొదటి పార్ట్ కథానాయకుడు ఆడియో వేడుక డిసెంబర్ 21న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుందని తెలిసిందే. కాగా ఈ ఆడియో ఈవెంట్‌కి సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజ‌రుకానున్నారు. మ‌రి.. జూనియర్ ఎన్టీఆర్ హాజ‌రు కానున్నాడా...? లేదా..? అనేది అంద‌రిలో ఉన్న డౌట్. 
 
ఇక అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోన‌వ‌స‌రం లేదు. తార‌క్ ఈ ఈవెంట్‌కు వ‌స్తున్నాడు. అలాగే ప్ర‌త్యేక‌ అతిథులుగా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, జమున, గీతాంజలి వంటి అప్పటి స్టార్స్ కూడా ఈ వేడుకకు ప్రత్యేక అతిధిలుగా రానున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ కథానాయకుడును జనవరి 9న విడుదల చేసి, ఫిబ్ర‌వ‌రి 7న రెండో పార్ట్ మహానాయకుడును విడుదల చేయనున్నారు.