శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (09:59 IST)

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ (Trailer)

నందమూరి బాలకృష్ణ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' అనే పేర్లతో జనవరి 9వ తేదీన, ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్నాయి. 
 
ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. అతి తక్కువ వ్యవధిలో ఒక మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్‌గా తెరకెక్కింది. 
 
ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటిస్తుంటే, విద్యాబాలన్, మోహన్ బాబు, రానా దగ్గుబాటు, సుమంత్, నందమూరి కళ్యాణ్ రామ్, రకుల్ ప్రీత్ సింగ్, కైకాల సత్యనారాయణ, నిత్యామీనన్, తదితరులు నటిస్తున్నారు.