మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (10:46 IST)

అజిత్‌ను గట్టిగా పట్టుకున్న పవన్ కల్యాణ్.. వీరమ్ ఓవర్.. వేదాళం, థెరి అంటూ..?!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రీమేక్‌లపై మనసుపడ్డాడు. ఇందుకు తమిళ హీరో అజిత్ నటించిన సినిమాలను ఎంచుకున్నాడు. ఇప్పటికే అజిత్ నటించిన వీరమ్ సినిమాను కాటమమరాయుడు సినిమా శుక్రవారం (మార్చి24) రిలీజ్ క

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రీమేక్‌లపై మనసుపడ్డాడు. ఇందుకు తమిళ హీరో అజిత్ నటించిన సినిమాలను ఎంచుకున్నాడు. ఇప్పటికే అజిత్ నటించిన వీరమ్ సినిమాను కాటమమరాయుడు సినిమా శుక్రవారం (మార్చి24) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా వీరుడొక్కడే అనే పేరుతో రిలీజైనా.. పూర్తిగా మార్చేసి రీమేక్ చేసేసాడు. 
 
మరోవైపు మిత్రుడు, దర్శకుడైన త్రివిక్రమ్‌తో కొత్త సినిమా చేసేందుకు పవన్ రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా గ్యాపులోనే అజిత్ తమిళంలో నటించిన వేదాళంను రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌పై కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా రీమేక్ చేయనున్నారని అందులో పవన్ నటిస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
 
విజయ్ హీరోగా తమిళంలో రూపొందిన థెరి సినిమాకు రీమేక్ అవుతుందని తెలిసింది. గత సమ్మర్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో దానిని రీమేక్ చేసేయాలని పవన్ భావిస్తున్నాడని తెలిసింది.