ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (12:01 IST)

మా డాడీ చాలా మంచోడు... నిందలేయొద్దు : పూరీ కుమార్తె పవిత్ర

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సిట్ బృందం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సిట్ బృందం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఈ వివాదంలో తన తండ్రిపేరు పేరు రావడంపై, ఆయన కుమార్తె పవిత్ర స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయవద్దని ప్రాధేయపడింది. తన తండ్రి సెలబ్రిటీ కావడంతోనే ఆయనపై పుకార్లు పుట్టిస్తున్నారని, ఈ తరహా చర్యలు సరైనవి కావంటూ, ఓ మాటనేముందు ఆ కుటుంబం గౌరవ మర్యాదల గురించి కూడా ఆలోచించాలని కోరింది.
 
పని పాటా లేకుండా పిచ్చి మాటలు మాట్లాడేవారే తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి పని చేసే వ్యక్తని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఎవరైనా మాట్లాడాలంటే, జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హెచ్చరించింది.